Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సానియా మీర్జా ఓ స్వీట్ గర్ల్ అంటున్న స్విస్ ఫెడ్

సానియా మీర్జా టెన్నిస్ ప్రపంచంలో తన సత్తా చాటడం ప్రారంభించిన తరువాత ఇండియాలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ వ్యాఖ్యానించాడు. ఐపీటీఎల్ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన ఫెడ్ మీడియాతో మాట్లాడుతూ, తాను 2014లో సానియాతో కలసి మిక్స్ డ్ డబుల్స్ ఆడానని, అప్పటికే ఆమెతో పరిచయం ఉందని, ఆమె ఓ 'స్వీట్ గర్ల్' అని అన్నాడు. హింగిస్ తో కలసి సానియా వింబుల్డన్ డబుల్స్ ఫైనల్ లో అద్భుత ఆటతీరు కనబరిచిందని ప్రశంసించాడు. సచిన్ టెండూల్కర్ అన్నా తనకు ఇష్టమని, వీడియోగేమ్ క్రికెట్ ఆడుతుంటే, తన జట్టులో సచిన్ ఉండాల్సిందేనని అన్నాడు. ఇండియాకు రావడం తనకెంతో సంతోషమని వెల్లడించాడు.

More Telugu News